సీనియర్ సినీ నటి, బీజెపీ నేత జయప్రదను వరుసగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. గతంలో కార్మికుల ఈఎస్ఐ సొమ్ము కాజేసిన కేసులో 6 నెలల జైలు శిక్షతో పాటు, 5 వేల రూపాయల జరిమానా ఆదేశించింది తమిళనాడు కోర్టు. తాజాగా 2019 లోక్ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు నమోదైన రెండు కేసుల్లో ఉచ్చు బిగుసుకుంది..
ప్రస్తుతం ఈ కేసులను విచారిస్తోంది ఉత్తరప్రదేశ్ లోని ప్రత్యేక కోర్టు. ఈ రెండు కేసుల విచారణకు హాజరు కావాలని ఇప్పటికే కోర్టు ఏడు సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ చేసింది. అయినప్పటికీ ఆమె బేఖాతరు చేసింది. దీంతో కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆమె పరారీలో ఉన్న నిందితురాలిగా పేర్కొంటూ..ఆమె అరెస్టుకు ఆదేశాలు ఇచ్చింది..!!