in

samantha back to work, announces health podcast!

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన తర్వాత సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. ఇప్పటికే అంగీకరించిన సినిమాలు కూడా పూర్తిచేసి ప్రస్తుతం విదేశాల్లో చికిత్స తీసుకుంది. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్న సామ్ ఓ హెల్త్ పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. స్నేహితులతో కలిసి ఈ పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించినట్టు పేర్కొంది..

మయోసైటిస్ కారణంగా తాను ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రతివారం ఓ పాడ్‌కాస్ట్‌ను విడుదల చేస్తానని తెలిపింది. ఈ మధ్యకాలంలో తనకు పనేమీ లేకుండా పోయిందని, అందుకే మళ్లీ పని ప్రారంభిస్తున్నట్టు ఆ పోస్టులో పేర్కొంది. ఫ్రెండ్స్‌తో కలిసి ఫన్ చేస్తున్నానని, ఓ హెల్త్ పాడ్‌కాస్ట్‌ను అనుకోకుండా ప్రారంభించామని, పని ప్రారంభించాక చాలా నచ్చిందని చెప్పుకొచ్చింది. అందరికీ ఉపయోగపడే ఈ కార్యక్రమం వచ్చే వారం నుంచే ప్రారంభమవుతుందని చెప్పడానికి సంతోషంగా ఉందని పేర్కొంది..!!

Sai Pallavi rejected the films of top actors!

Keerthy Suresh reveals about her first love letter!