in

vijay devarakonda is boyapati’s next hero?

బోయపాటి శ్రీను, గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ల కాంబోలో త్వరలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకుముందు ‘సరైనోడు’ సినిమా రాగా ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ అందుకోవడమే కాకుండా అల్లు అర్జున్‌కు మాస్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టింది. ఇక 2016 తర్వాత అల్లు అరవింద్‌, బోయపాటి చేతులు కలుపుతుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి..

అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మొదట అల్లు అర్జున్‌తో ఈ సినిమా ఉండబోతుందని అందరూ అనుకున్నారు. కానీ బాలయ్యతో బోయపాటి ‘అఖండ 2’ ప్లాన్ చేస్తున్నట్లు ఈ సినిమాకు అల్లు అరవింద్‌ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు వైరల్‌ అవుతునే మరో క్రేజీ న్యూస్‌ బయటకు వచ్చింది. బోయపాటి శ్రీను, అల్లు అరవింద్‌ల కాంబోలో వచ్చే ప్రాజెక్ట్‌లో రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా నటించనున్నట్లు సమాచారం..!!

Naga Chaitanya is all set to tie the knot for second time?

murnal thakur to be part of tollywood’s most awaited movie?