in

murnal thakur to be part of tollywood’s most awaited movie?

మృనాల్ ఠాకూర్..ఈ పేరు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మార్మోగిపోతోందనడం అతిశయోక్తి కాదేమో.! ఒకే ఒక్క సినిమా.. అదే ‘సీతారామం’. ఆ సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది అందాల భామ మృనాల్. ఇటీవల వచ్చిన ‘హాయ్ నాన్న’ తో మరో హిట్టుని ఖాతాలో వేసుకున్న మృనాల్, త్వరలో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో సందడి చేయబోతోంది.

విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరో..ఇప్పుడీ బ్యూటీ మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో భాగం కాబోతోందిట. పైగా, అది పాన్ ఇండియా సినిమా కాబోతోందిట. కాదు కాదు, అది పాన్ వరల్డ్ ప్రాజెక్ట్..అదే, మహేష్ – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్‌బాబు మీద లుక్ టెస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది..!!

vijay devarakonda is boyapati’s next hero?

Actress Malvi Malhotra cheated by a producer!