ఇంకా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా మొదలుకాకుండా అప్పుడే రామ్ చరణ్ 17 గురించిన ప్రచారం మొదలైపోయింది. బాలీవుడ్ కల్ట్ దర్శకుడిగా పేరున్న సంజయ్ లీలా భన్సాలీతో ఓ ప్యాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడనే వార్త ఊపందుకుంది. గత కొంత కాలంగా చరణ్ విపరీతంగా ముంబై ట్రిప్పులు కొడుతున్నాడు. అది ఈ ప్రాజెక్టు కోసమేననే కామెంట్లకు లింక్ కుదురుతోంది. నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది..
పదకొండో శతాబ్దానికి చెందిన సుహల్ దేవ్ అనే పోరాట యోధుడి గాధను తెరకెక్కించేందుకు భన్సాలీ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. శ్రావస్టి సామ్రాజ్యానికి రాజైన ఈ చక్రవర్తి అతి తక్కువ సైన్యంతో ఘాజి సలార్ మసూద్ ని ఓడించి చంపడం గురించి చరిత్రలో ఎన్నో కథలున్నాయి. వాటి ఆధారంగానే దీన్ని తెరకెక్కిస్తారట. ఒకవేళ ఇదే వాస్తవమైతే అంతకన్నా గూస్ బంప్స్ అభిమానులకు ఇంకేముంటుంది..!!