in

after jr ntr, janhvi kapoor to romance tollywood’s global star!

రణ్ ప్రస్తుతం తన 15వ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో..పాన్ ఇండియా సినిమా స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే, ఆ తరువాత ప్రాజెక్టును చరణ్ లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహించనున్నాడు. చరణ్ కెరియర్ లో ఇది 16వ సినిమా. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి..

కొన్ని పాత్రలకి సంబంధించి,  విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ చాలా కొత్తగా కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయంపై కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా జాన్వీ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమా కోసం ఆమెను ఎంపిక చేయడం ఆల్రెడీ జరిగిపోయిందని అంటున్నారు. ఈ జోడీ పట్ల ఆడియన్స్ ఉత్సాహంగా ఉన్నారు..!!

Ram Charan to team up with Bollywood’s cult director?

Eagle!