in

Rashmika hits back at rumors of charging 4.5 cr after Animal

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతోంది. పుష్ప, యానిమల్ మూవీ విజయాలతో తనకు ప్రస్తుతానికి తిరుగేలేదని నిరూపించుకుంది. ఇక పుష్ప-2 కోసం సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే, ‘యానిమల్’ తరువాత రష్మిక తన రెమ్యూనరేషన్‌‌ను భారీగా పెంచేసిందన్న వార్తలు వైరల్‌గా మారాయి. ఒక్కో సినిమాకు రూ.4 కోట్లు డిమాండ్ చేస్తోందంటూ  వార్తలు వెలువడ్డాయి.

సినీ వర్గాల్లో ఈ వార్త పెద్ద చర్చకే దారి తీయడంతో రష్మిక ఎట్టకేలకు స్పందించింది. వార్తలపై సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రెమ్యూనరేషన్ పెంచానా? ఇలా అని ఎవరు అంటున్నారో? ఈ వార్తలు చూస్తుంటే నాకూ అలాగే చేయాలనిపిస్తోంది. పారితోషికం ఎందుకు పెంచారని నిర్మాతలు అడిగితే మీడియా అలా అంటోంది సార్ అని సమాధానమిస్తా. వాళ్ల అంచనాలను అందుకోవడం మినహా నేనింక చేసేదేముంది’’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది రష్మిక..!!

‘baby’ to be remake as ‘Cult Bomma’ with kushi kapoor?

Janhvi Kapoor To Replace Sai Pallavi In Nitesh Tiwari’s ‘Ramayana’?