ఈచిత్రం హిందూవుల మనోభావాలను దెబ్బతీసిందని..తాను..తన టీమ్ ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోవడం లేదని..తన సినిమా పై నెలకొన్న వివాదం పై క్షమాపణలు తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్ స్టాలో జై శ్రీరామ్ అంటూ నోట్ షేర్ చేసింది. జై శ్రీరాం..గత కొన్ని రోజులుగా నా సినిమా ‘అన్నపూరణి’ చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నాను.
‘అన్నపూరణి’ సినిమాను కేవలం కమర్షియల్ ఉద్దేశ్యంతో కాకుండా ప్రజల్లోకి మంచి ఆలోచనను తీసుకెళ్లే ప్రయత్నంగా చూశాం. దృఢ సంకల్పంతో పోరాడితే ఏదైనా సాధించవచ్చు అనే ఆలోచనతోనే ఈ సినిమాను చేశాం. కేవలం ఈ మూవీ ద్వారా సానుకూల సందేశాన్ని అందించాలని భావించాము.. కానీ మాకు తెలియకుండానే కొందరి మనసులను గాయపరిచామని తెలిసింది. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు, నా టీంకు లేదు..!!