తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విని.. తన మనసులో ఆ స్టార్ హీరోకి ఎప్పటికీ స్థానం చెరిగిపోదు అంటూ కామెంట్లు చేసింది.ఇక ఎవరా హీరో అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ..అశ్విని మాట్లాడుతూ..” నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా పిచ్చి..ఆయన నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ ఫ్రెండ్ గా నేను నటించాను..పవన్ తో దాదాపు మూడు నెలల పాటు జర్నీ చేశాను.. షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ నన్ను కూర్చోబెట్టుకొని మరీ మాట్లాడేవారు..
నాతో డాన్స్ లు చేయించేవారు. మేము చాలా సరదాగా ఉండేవాళ్ళము..షూటింగ్లో అశ్విని కమాన్ అని నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు..అంతేకాదు ఆయనకి ఎప్పుడైనా బోర్ కొట్టినా నన్నే పిలిచేవారు.ఇక ఇద్దరం కలిసి క్యారీ వ్యాన్ లో ఉండే వాళ్ళం.. అయితే ఇప్పుడు ఆయన నన్ను మర్చిపోయి ఉంటారు కానీ ఎప్పుడూ నేను మాత్రం మర్చిపోను ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ నావాడే అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ..!!