in

telugu Actress Pragathi wins bronze in the powerlifting championship!

సినిమాలకు కొన్నేళ్లపాటు బ్రేక్ ఇచ్చింది ప్రగతి. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. ఇక ఈ మధ్య సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ప్రగతి..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ జిమ్ లో కసరత్తులు చేస్తూ కనిపించడం మొదలుపెట్టింది. దీంతో ఈ వయసులో ఇవన్నీ ఎందుకని ఎంతో మందిని కామెంట్స్ చేశారు. కానీ నేషనల్ లెవెల్ లో తన సత్తా చాటుతుందని ఎవరు ఊహించలేదు. ఇటీవల బెంగళూరులో 28వ పురుషులు, మహిళల జాతీయ స్థాయి బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ జరిగింది.

ఈ పోటీలలో పాల్గొన్న ప్రగతి మూడవ స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకుంది. ఈ పోటీలకు బెంగళూరులోని ఇంజనీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా నిలిచింది. ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్లతో పోటీపడి ప్రగతి ఈ పథకం సాధించడం విశేషం. 48 ఏళ్ల వయసులో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో కాంస్యం సాధించడం అంటే మాటలు కాదు. దీంతో సూపర్ ప్రగతి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు..!!

rashmika compares animal with arjun reddy!

nani about marrying vizag girl love and affection!