in

Meenakshi Choudhary and Trisha in balayya’s next?

బాలకృష్ణ ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అవి కూడా సాధారణమైన విజయాలేం కాదు..సంచలన విజయాలు. ‘అఖండ’..’వీరసింహారెడ్డి’ ..’భగవంత్ కేసరి’ సినిమాలతో బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత కూడా ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన మరో ప్రాజెక్టును లైన్లో పెట్టారు. బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమాను బాబీ దర్శకత్వంలో చేయనున్నారు. కెరియర్ పరంగా ఇది ఆయనకు 109వ సినిమా.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నాయి. సితార నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా, యాక్షన్..ఎమోషన్స్ ను కలుపుకుంటూ బాలయ్య మార్కులోనే సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికలుగా ఎవరిని తీసుకుంటారా అనేది అందరిలో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే త్రిష – మీనాక్షి చౌదరి పేర్లు తెరపైకి వచ్చాయి. గతంలో బాలయ్యతో కలిసి త్రిష ‘లయన్’ సినిమా చేసింది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది..!!

Veteran actress Aamani confirms presence of casting couch!

Allu Arjun and Trivikram’s Socio-Fantasy movie?