ఓఇంటర్వ్యూలో హీరోయిన్ త్రిష పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరలేపిన నటుడు మన్సూర్ అలీఖాన్ వివరణ ఇచ్చారు. త్రిష గురించి తాను తప్పుగా మాట్లాడలేదని, అందుకే క్షమాపణ కోరబోనని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. త్రిషకు క్షమాపణ చెప్పని కారణంగా నడిగర్ సంఘం తనపై నిషేధం విధించడంపై ఆయన స్పందించారు. నిషేధం విధించి నడిగర్ సంఘం తప్పు చేసిందని వ్యాఖ్యానించారు.
వివరణ అడగకుండా, విచారణ జరపకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. సినిమాల్లో హత్య చేస్తే నిజంగానే చేసినట్లు కాదని, సినిమాల్లో రేప్ చేస్తే నిజంగానే చేసినట్లా? అని ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకునేందుకు నడిగర్ సంఘానికి 4 గంటలు సమయమిస్తున్నానని డెడ్‌లైన్ విధించారు. తనకు తమిళనాడు ప్రజల మద్దతు ఉందని, తాను క్షమాపణ చెప్పే వ్యక్తిలా కనిపిస్తున్నానా? అని ప్రశ్నించారు..!!