in

The hunt for ram Pothineni’s heroine is over!!

బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తీస్తున్నారు పూరి జగన్నాధ్. “డబుల్ ఇస్మార్ట్” పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే హీరో రామ్ తో పాటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ఖరారయ్యారు. సంజయ్ దత్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ సెరవేగంగా సాగుతోంది. ఐతే ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయినప్పటికీ, ఇంతవరకు ఈ చిత్రంలో రామ్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారో బయటపెట్టలేదు మేకర్స్.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ కు జోడిగా సాక్షి వైద్యను తీసుకున్నట్టు తెలుస్తోంది. సాక్షి ఇప్పటివరకు రెండు చిత్రాలలో మాత్రమే నటించింది. కానీ ఈ రెండు చిత్రాలు ప్రొడ్యూసర్లకు భారీ నష్టాలను మిగిల్చాయి. సాక్షి నటించిన మొదటి చిత్రం ఏజెంట్. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం ఏజెంట్. మరి ఈమె నటిస్తున్న మూడో చిత్రమైన మంచి ఫలితాన్ని రాబడుతుందో లేదో, వేచి చూడాల్సిందే..!!

Varalaxmi Sarathkumar: I smoked cigarette for the first time in ‘Kotabommali PS’

Mansoor Ali Khan refuses to apologies for his comments about Trisha!