సినిమాలలో నటించాలనేది చాలా మందికి తీరని కోరికగా మిగిలిపోతుంది, తమ కోరికను తీర్చుకోవడానికి అన్ని వదిలేసి, “ఒక్క ఛాన్స్” అంటూ స్టూడియోల చుట్టూ, నిర్మాతలు, డైరెక్టర్ల చుట్టూ తిరుగుతూ సగం జీవితం సంక నాకిపోయిన, ఒక్క ఛాన్స్ వస్తే చాలు అప్పటి వరకు ఉన్న సూపర్ స్టార్ లు మోటష్ అయిపోతారు అనుకుంటూ బతికేస్తుంటారు. కానీ మరి కొంత మంది నాకొద్దు బాబోయ్ ఈ యాక్టింగ్ అనే వాళ్ళు అనుకోకుండా నటులు అయ్యి, వెండి తెర దుమ్ము దులిపేస్తారు. ఆ కోవకు చెందిన వాడే మన విలన్ రామి రెడ్డి. నటుడవ్వాలని కలలో కూడా అనుకోలేదు, మంచి జర్నలిస్ట్ అవ్వాలి అనుకోని, చిత్తూరు జిల్లా వాల్మీకి పురం లో పుట్టిన రామి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ లో జర్నలిజం చేసారు. ఎక్కడ ఉన్న అక్కడి వారితో స్నేహం చేయటం, అక్కడి వేష భాషలను అలవరించు కోవటం ఆయన స్వభావం. రామి రెడ్డి తెలంగాణ వాసి కాదు అని చెపితే ఎవరు నమ్మరు, అయన భాష, యాస చుసిన వారు. జర్నలిస్ట్ గ, డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి ఇంటర్వ్యూ కోసం టైం సంపాదించిన రామి రెడ్డి ఆయనను కలవటానికి వెళ్లారు. అప్పటికే “అంకుశం” సినిమా కోసం విలన్ పాత్రధారి కోసం వేటలో ఉన్నారు కోడి రామకృష్ణ..
జీన్స్ ప్యాంటు, పొడవాటి జుబ్బాలో, పాన్ నములుతూ తీరికగా వస్తున్న రామి రెడ్డి ని చూసిన కోడి రామకృష్ణ, నా విలన్ దొరికాడు అనుకున్నారు, పరిచయాలు అయ్యాక, ఇంటర్వ్యూ తీసుకున్న రామి రెడ్డి కి తన మనసులో మాట చెప్పారు కోడి, మనకు యాక్టింగ్, విక్టింగ్ తెల్వద్, నన్ను వదిలేయ్యుండ్రి అన్నాడు రామి రెడ్డి, నువ్వు ఏమి చెయ్యొద్దు నేను చెప్పినట్లు చెయ్ బాస్ చాలు, అంతా నేను చూసుకొంటాను అని తగులుకున్నారు కోడి, చివరకు అయిష్టంగా ఒప్పుకున్నారు రామి రెడ్డి, గంతే! టాలీవుడ్ లో విలన్ క్యారక్టర్ లకు నీల కంఠం రోల్ తో స్పాట్ పెట్టేసాడు రామి రెడ్డి. అంకుశం సినిమా తరువాత రామి రెడ్డి కి అవకాశాలు కుప్పలు, తెప్పలుగా వచ్చి పడ్డాయి. హిందీ లో ఎంట్రీ ఇచ్చాడు రామి రెడ్డి,” స్పాట్ నానా” గ పాపులర్ అయ్యాడు, తెలుగు హిందీ రంగాలలో తిరుగులేని విలన్ గ ఎదిగారు. దీనినే అంటారు డెస్టినీ అని, వై.ఎస్. షర్మిల గారి భాషలో చెప్పాలి అంటే డెస్టినీ అంటే “విధి” మనం అనుకోనివి ఎన్నో విషయాలు మన జీవితంలో మన ప్రమేయం లేకుండా జరిగి పోతుంటాయి. కడుపులోవికారంగా ఉండదు, మనసు నిండిపోతుంది, కడుపు చల్లగా అవుతుంది. ఇటువంటి అదృష్టం కొంత మందికే ఉంటుంది..!!