in

sai pallavi breaking for the rules?

హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఫిదా సినిమా తర్వాత దాదాపు 30 సినిమాలలో ఆఫర్లు లభించినా చాలా తక్కువ ఆఫర్స్ కి మాత్రమే ఆమె ఓకే చేసింది. ఇకపోతే తన నటనతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ విషయంలో కూడా కొన్ని రూల్స్ ఫాలో అవుతూ ఉంటుంది. ఆరేళ్ల కెరియర్ లోనే ఇప్పటివరకు వాటిని ఎప్పుడు క్రాస్ చేయలేదు..ఇక ఆ రూల్స్ ఏమిటా అనే విషయానికి వస్తే..మొదటిది గ్లామర్ షో చేయడానికి ససేమీరా అంటుంది..

రెండోది క్యారెక్టర్..కోట్లు ఇచ్చినా సరే కథ నచ్చకపోతే అవతల ఎంత పెద్ద హీరో, డైరెక్టర్ అయినా సరే మొహం మీదే చెప్పేయడం ఆమె స్టైల్ .. అందుకే డియర్ కామ్రేడ్, భోళా శంకర్ వంటి సినిమాలకు కూడా నో చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు తెలుగులో ఇప్పటివరకు ఏ ఒక్క స్టార్ హీరోతో కూడా కలిసి నటించలేదు. ఇక గ్లామర్ షో కి దూరంగా ఉండే సాయి పల్లవి వైపు మన స్టార్ హీరోలు కూడా చూడలేదని చెప్పాలి. అలాంటి ఈమెకు తాజాగా రాంచరణ్ సరసన నటించే అవకాశం లభించింది . పక్కా రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ నేపథ్యంలో బుచ్చిబాబు ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..!!

TOLLYWOOD KI SPOT PETTINA RAMI REDDY!

alia responds about rumors ranbir not being a good husband!