in

Salaar Vs Dunki: Is Prabhas starrer postponed to 2024?

త కొన్ని రోజుల నుండి ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌ లో వస్తున్న ‘సలార్‌’ సినిమా మళ్ళీ విడుదల వాయిదా పడనున్నది అనే వార్తలు బాగా వైరల్‌ అవుతున్నాయి. ఈ సినిమా ఇంతకు ముందు చాలా సార్లు విడుదల వాయిదా వేస్తూ వచ్చారు, కానీ తప్పకుండా డిసెంబర్‌ 22 న విడుదల చేస్తాం అని కొన్ని వారాల క్రితం ప్రకటించారు. అయితే ఈ తేదీకి కూడా సినిమా రావటం లేదని, షారుఖ్‌ ఖాన్‌ ‘డంకి’ చఆబీనిసతి అదే రోజు విడుదల అవుతూ ఉండటంతో, ఆ సినిమా కోసమని ‘సలార్‌’ విడుదల వాయిదా వేస్తున్నట్టుగా వార్త వస్తోంది.

అయితే విడుదల వాయిదా పడుతోంది అనే వార్త విూద చిత్ర దర్శకుడు, నిర్మాత స్పందించలేదు కానీ, ఈరోజు ఆ చిత్ర టీము ఒక ప్రకటన విడుదల చేసింది. అదేంటి అంటే కేరళ డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు ఆ సినిమాలో నటించిన మలయాళ నటుడు పృథ్విరాజ్‌ సుకుమారన్‌ తీసుకున్నారు అని. అదే ప్రకటనలో ఈ సినిమా డిసెంబర్‌ 22న విడుదలవుతోంది అని చెప్పారు. దీనిని బట్టి ‘సలార్‌’ డిసెంబర్‌ 22న విడుదల అవుతున్నట్టుగా మరోసారి చిత్ర నిర్వాహకులు పునరుద్ఘాటించినట్టుగా ఈ అధికారిక ప్రకటన చెప్పకనే చెపుతోంది..!!

Anasuya’s Comments On Allu Arjun Manipulated!

Mrunal Thakur getting married to a Telugu boy?