అల్లు అరవింద్ ఉత్తమనటి అవార్డును ‘సీతారామం’లో నటించిన మృణాల్ ఠాకూర్‌కి బహుకరించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్, మృణాల్‌ని ఆశీర్వదించారు. ఇంతకు ముందు నేను ఒక హీరోయిన్ (లావణ్య త్రిపాఠి)కి తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపో అని ఆశీర్వదిస్తే, ఆ అమ్మాయి మా కుటుంబ సభ్యుడినే చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపొయింది. మృణాల్ ఠాకూర్ కి కూడా అలాంటి బ్లెస్సింగ్స్ ఇచ్చారు అల్లు అరవింద్. అప్పట్లో ఆ వీడియో బాగా వైరల్ అయింది. అయితే ఈ బ్లెస్సింగ్ ఒక పుకారులా వ్యాపించి మృణాల్ ఠాకూర్ ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసేసుకుంది అనేంత వరకు వెళ్ళింది.
ఇంకేముంది, మృణాల్ ని తన బంధువులు, ఆమె టీములో వాళ్ళు, డిజైనర్స్, స్నేహితులు ఇలా అందరూ ఆమెని అడుగుతూ ఉన్నారట. తెలుగు అబ్బాయిని చూసుకున్నావా? మాకు చెప్పలేదు అని. ఇక వాళ్ళకోసం ఇంత ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ పెట్టేసింది. ‘‘నేను ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను అని ఒక పుకారు వచ్చింది. కానీ సారీ నేను చేసుకోలేదు, అదంతా వట్టి పుకారు మాత్రమే. నాకు కేవలం ఆశీర్వాదం మాత్రమే లభించింది. ఈ పుకారు విని సరదాగా నవ్వుకున్నాను. త్వరలో పెళ్లి జరుగుతుంది, మీరే పెళ్ళికొడుకుని వెతికి పెట్టండి, లొకేషన్ కూడా నాకు షేర్ చెయ్యండి’’ అంటూ ఒక సరదా స్టోరీ పోస్ట్ చేసింది మృణాల్..!!