పుష్ప: ది రైజ్ దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప: ది రూల్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈక్రమంలో సినిమాలో కీలకపాత్రలో నటించిన అనసూయ ఇటివల ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి చెప్పినట్టు వచ్చిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై ఆమె స్పందించారు. ‘అందులో ఎటువంటి నిజమూ లేదు. నేనెప్పుడూ అలా అనలేదు. అనని మాటలు అన్నట్టుగా తారుమారు చేశార’ని అన్నారు.
‘పుష్ప 1కి సంబంధించి అల్లు అర్జున్ సోషల్ మీడియా నుంచి ఫుల్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. తన డ్యాన్స్ పై మరింతగా శ్రద్ధ పెట్టనున్నారు. తొలిభాగంలో ఉన్న లోపాలను రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నా పాత్రను ఫహద్ ఫాజిల్, బ్రహ్మాజీ, సునీల్ తో సన్నివేశాలు మరింత ఎక్కువ ఉండేలా చూశారు. పుష్ప1 ను మించి పుష్ప2 ఉండబోతోంద’ని ఆమె అన్నట్టుగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలనే ఆమె ఖండించారు..!!