బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రేష్ రష్మిక మందన్నా జంటగా వస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. యానిమల్ సినిమా సెన్సార్ బోర్డు 3 గంటల 30 నిమిషాల నిడివితో పంపించారట. సాధారంణంగా ఒక సినిమా 2 గంటల 45 నిమిషాలు ఉంటే ల్యాగ్ సినిమా అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తారు. అలాంటిది యానిమల్ సినిమా 3 గంటల 30 నిమిషాలు..అంటే సందీప్ రెడ్డి వంగా ప్లాన్ ఏదో గట్టిగానే చేస్తున్నాడు అని అంటున్నారు.
యానిమల్ నిడివి విషయంలో హీరో రణబీర్ కపూర్ కూడా డైరెక్టర్ కే సపొర్ట్ చేస్తున్నాడట. అంటే..సినిమాలో ఎంత మ్యాటర్ ఉందో అర్థమవుతుంది. ఒకే యానిమల్ సినిమా ఇలా 3 గంటల 30 నిమిషాలతోనే రిలీజ్ అయితే, రెండు ఇంటర్వెల్స్ పెట్టాల్సి వస్తుంది. కాగా, గతంలో అర్జున్ రెడ్డి సినిమాను కూడా సందీప్ 4గంటల నిడివితో ప్లాన్ చేశాడట. కానీ ఫస్ట్ సినిమాకే ఇలా ఉంటే, ఆడియన్స్ థియేటర్స్ వరకు కూడా రారనే ఉద్ధేశ్యంతో మార్చుకున్నాడట. కానీ, ఇప్పుడు ఆడియన్స్ కు సందీప్ రెడ్డి ప్రతిభ తెలుసు కాబట్టి..యానిమల్ విషయంలో తగ్గేదే లేదు అన్నట్టు ఉన్నారట ..!!