in

No Takers For priyanka, but still hikes her fees!

ప్రియాంక మోహన్..పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘ఓజీ’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతైనా పవన్ కళ్యాణ్ సినిమా కదా. ఆ మాత్రం కిక్కుంటుంది. తాజాగా అందుతోన్న ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం ప్రకారం ప్రియాంక మోహన్ రెమ్యునరేషన్ బాగా పెంచేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచీ బజ్ ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్..గతంలో రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్..సినిమాని విశేషంగా ఇన్నోవేటివ్‌గా ప్రమోట్ చేస్తున్నాయ్.

‘ఓజీ’తో తన దశ తిరిగినట్లే అనుకుంటుందో ఏమో ప్రియాంక మోహన్ రెమ్యునరేషన్ బాగా డిమాండ్ చేస్తోందట. ఇంతకు ముందు ప్రియాంక చేసిన సినిమాల్లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. శర్వా నంద్‌తో చేసిన ‘శ్రీకారం’, నానితో చేసిన ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలే. అయితే, ఆ రెండు సినిమాలూ హిట్ ట్రాక్‌లో వున్నవే అనుకోండి. ఏది ఏమైతేనేం, ప్రియాంకకు పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ రావడమే పెద్ద విశేషం. అదే జరిగినప్పుడు రెమ్యునరేషన్ విషయంలో పాప తీసుకున్న డెసిషన్ తప్పేం లేదు మరి. అయితే, నిర్మాతలు ఎలా తీసుకుంటారన్నదే ఇక్కడ నోటీస్ చేయాల్సిన పాయింట్..!!

after balayya kajal to romance nagarjuna?

Rashmika on board for Dhanush’s movie with Sekhar Kammula!