in

after balayya kajal to romance nagarjuna?

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తూనే మరొకవైపు సినిమా షూటింగ్లలో పాల్గొంటోంది..తాజాగా కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా హీరో నాగార్జునతో డేట్ కు వెళ్లేందుకు సిద్ధమేనని చెప్పి అందరికీ ఆశ్చర్యానికి కలిగించింది.. ఒక వేదికపై కాజల్ మాట్లాడుతూ మీరు ఎవరితో డేట్ కి వెళ్లాల్సి వస్తే వెళ్తారు అని అడగగా.. ఆమె వెంటనే నాగార్జున పేరు చెప్పింది. ఇలా చెప్పడంతో ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

గతంలో నాగార్జునతో నటించే అవకాశం ది ఘోస్ట్ సినిమాకి రాగా కొన్ని కారణాల చేత ఈమె ఆ సినిమా నుంచి తప్పుకుంది..ఈమె స్థానంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఎంపికయింది.. మళ్లీ ఇప్పుడు దాదాపుగా రెండు సంవత్సరాల తర్వాత నాగార్జునతో నటించడానికి సిద్ధమయ్యింది..కొరియోగ్రాఫర్ విజయ్ భిన్న దర్శకత్వంలో నాగార్జున ఒక సినిమాలు నటించడానికి సిద్ధమయ్యారు ఈ సినిమా కూడా రీమిక్ అన్నట్లుగా సమాచారం ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఎంపిక అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా సీనియర్ హీరోలకు ఓకే చెబుతున్న ఈ ముద్దుగుమ్మ బాలయ్య సినిమాలో కూడా నటిస్తోంది..!!

megastar Chiranjeevi to undergo knee surgery soon!

No Takers For priyanka, but still hikes her fees!