ప్రస్తుతం ‘బవాల్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న జాన్వీ కపూర్.. ఇటీవల హీరో వరుణ్ ధావన్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ..‘‘నిజంగా ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం కోసం నేను చాలా కాలం ఎదురుచూశాను. ‘దేవర’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి నన్ను హీరోయిన్గా తీసుకుంటే బాగుండని అనుకున్నాను. నాకు ఆ అవకాశం దొరకాలి..అవకాశం దొరకాలి అని ఒక ఏడాదిపాటు కోరుకున్నాను. చివరకు నాకోరిక తీరింది.
ఇప్పుడు నేను ఆయనతో కలిసి షూటింగ్ లో పాల్గొంటున్నాను’’ అని చెప్పింది. ఇంతకముందు ‘మిలి’ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా జాన్వీ..తారక్ తో నటించాలనే తన మనసులోని కోరికను వెలిబుచ్చింది. ”నేను ఇంతకు ముందు చెప్పాను.. మళ్ళీ చెబుతాను. ఎన్టీఆర్ సార్ తో పనిచేయాలని ఎవరికి ఇష్టం ఉండదు? అలాంటి లెజెండ్, అలాంటి ఐకాన్ యాక్టర్ తో కలిసి పనిచేయడం ఒక డ్రీమ్” అని జాన్వీ తెలిపింది. ఇప్పుడు లేటెస్టుగా మరోసారి తారక్ తో నటించడం గురించి తన ఉత్సాహాన్ని పంచుకుంది..!!