తెలుగులో హార్ట్ అటాక్ చిత్రంతో ప్రేక్షకుల గుండెల్లో బాణాలను గుచ్చినా ఆదాశర్మ మళ్ళీ టాలీవుడ్ లో చిత్రాలు చేసింది చాలా తక్కువ అని చెప్పాలి. కానీ బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తూ ట్రాక్ లో ఉంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆదా శర్మకు హెల్త్ సమస్య వచ్చింది.. ఒకే సారి రెండు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తీవ్ర అస్వస్థకు లోనయినట్లు తన సిబ్బంది నుండి వార్తలు వచ్చాయి..
వెంటనే ఈమెను ముంబైలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో జాయిన్ చేయించి చికిత్సను అందిస్తున్నారట. కాగా ఈమె తాజాగా నటించిన “కమాండో” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కావడానికి ముంబై రాగా ఆమెకు ఫుడ్ అలెర్జీ మరియు డయేరియా రావడంతో తీవ్రంగా అనారోగ్యంగా ఇబ్బందులను ఎదుర్కొంది. గతంలో ఈమె నటించిన “ది కాశ్మీర్ ఫైల్స్” హిట్ సాధించడంతో ఆఫర్లు ఎక్కువయ్యాయి..!!