బిటౌన్ పై ఫుల్ ఫోకస్ పెట్టి అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. ప్రస్తుతం ఆమె గేమ్ చేంజర్ చిత్రంలో మరోసారి చెర్రీకి జోడిగా నటిస్తోంది. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో ప్రియుడు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న రాజస్థాన్లో విరి వివాహం జరిగింది. గత నెలలో ఈమె పొట్ట కాస్త పెద్దదిగా కనిపించడంతో ప్రెగ్నెంటా? అని కామెంట్లు చేశారు. అయితే తర్వాత మళ్లీ నాజూకుగా కనిపించడంతో అలాంటిదేం లేదని తేలిపోయింది.
కానీ కియారాకు ప్రెగ్నెంట్ అవ్వాలని ఎప్పటినుంచో ఉంది. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించండి. 2019లో వచ్చిన గుడ్ న్యూస్ సినిమా రిలీజ్ సమయంలో ఆమె మాట్లాడుతూ తనకు ప్రెగ్నెంట్ కావాలని ఉందని చెప్పింది. ఆ సమయంలో తనకు నచ్చింది తినొచ్చని, అడ్డు చెప్పే వారే ఉండరని అభిప్రాయపడింది. తనకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ ఎవరైనా సరే కానీ ఆరోగ్యంగా ఉంటే అంతే చాలంది. తాజాగా ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరోసారి వైరల్ గా మారాయి..!!