తెలుగు. తమిళ ..మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ ఉంది. ఆమె తాజా చిత్రంగా రూపొందిన ‘భోళాశంకర్’ ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వేదాళం’ రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో ఆమె చిరంజీవికి చెల్లెలిగా కనిపించనుంది. కథ అంతా కూడా ఆమె పాత్ర ప్రధానంగానే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగులో కీర్తి సురేశ్ మరో ప్రాజెక్టును అంగీకరించిందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ వారు నాగచైతన్య హీరోగా ఒక సినిమాను నిర్మించనున్నారు.
ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ప్రేమమ్’ హిట్ కాగా, ‘సవ్యసాచి’ పరాజయం పాలైంది. ఇప్పుడు మూడో ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. సూరత్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. బోట్ డ్రైవర్ గా చైతూ .. అతనిని ప్రేమించే యువతిగా కీర్తి సురేశ్ కనిపించనుందని చెబుతున్నారు. ఇక హిందీలో వరుణ్ ధావన్ హీరోగా రూపొందనున్న ‘తెరి’ రీమేక్ లోను కీర్తి సురేశ్ ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది..!!