in

Lavanya Tripathi reacts to rumors about her illness!

మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై ఎక్కువగా తప్పుడు కథనాలు క్రియేట్ చేసి ప్రచారం చేయడం పరిపాటిగా మారిపోయింది. ఫాల్స్ న్యూస్ కారణంగా వెబ్ ట్రాఫిక్ పెరుగుతుందని కొంతమంది ఇలాంటి గాసిప్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. అలాగే లావణ్య త్రిపాఠిపైన కూడా ఓ కొత్త రూమర్ ప్రచారంలోకి తీసుకొచ్చారు. లావణ్య త్రిపాఠి అరుదైన వ్యాధి బారిన పడిందని, కొత్తవాటిని చూసినపుడు ఆమె భయపడుతుందని, గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తున్నారు.

ఈ వ్యాధికి ఆమె ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది అంటూ కథనాలు వండి వార్చారు. ఈ తప్పుడు ప్రచారాలపై లావణ్య త్రిపాఠి రియాక్ట్ అయ్యారు. నాకు వ్యాధి ఉందనే విషయం నాకే తెలియదనే విధంగా ఆమె క్వశ్చన్ మార్క్ పెట్టి అడిగారు. ప్రస్తుతం తాను పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతంగా ఉన్నానని, తనని ఎలాంటి వ్యాధులు లేవంటూ లావణ్య క్లారిటీ ఇచ్చారు. అలాగే ఇలాంటి తప్పుడు వార్తలు మీకు ఎలా ప్రచారం చేయాలనిపిస్తోంది. ఏదైనా వార్త రాసేముందు పూర్తిగా తెలుసుకొని రాయండి అంటూ ఆమె విమర్శలు చేయడం విశేషం..!!

up beauty Palak Lalwani Key Role in ‘Bhagavanth Kesari’!

Tamannah Trolled badly For ‘Lust Stories 2’ Promotions!