in

dasara villain joins jr ntr’s devara!

జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న దేవర షూటింగ్ స్పీడందుకుంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. విలన్ గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కు సైతం ఇదే తొలి టాలీవుడ్ డెబ్యూ. ఆదిపురుష్ లో చేసినా అది హిందీ చిత్రం కాబట్టి కౌంట్ లోకి రాదు. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న దేవరకు సంబంధించి ఇప్పటిదాకా ముప్పై శాతానికి పైగానే చిత్రీకరణ పూర్తయినట్టుగా ఇన్ సైడ్ టాక్.

తాజాగా ఈ క్యాస్టింగ్ కి మరో ఆకర్షణ తోడైంది. దసరా విలన్ షైన్ టామ్ చాకో దేవరలో చేరాడు. ఇది తనకు మూడో తెలుగు సినిమా. నాగ శౌర్య రంగబలో ప్రధాన పాత్ర పోషించాడు. దేవరలో తానున్న విషయం స్వయంగా సోషల్ మీడియా పోస్టుల ద్వారా షేర్ చేసుకున్న షైన్ టామ్ చాకో మెల్లగా ఇక్కడ మంచి అవకాశాలు పడుతున్నాడు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, సంపత్ తదితరులు రొటీన్ అయిపోయాక సరైన ప్రతినాయకులను ఎంచుకోవడం డైరెక్టర్లకు సవాల్ గా మారింది. అందుకే సలార్ కోసం పృథ్విరాజ్ ని తీసుకొస్తే దేవర కోసం సైఫ్, టామ్ చాకోలు తోడయ్యారు..!!

inside talk: sreeleela happy with pooja hegde’s exit

samantha shocking fees for Tommy Hilfiger campaign!