in

inside talk: sreeleela happy with pooja hegde’s exit

గత రెండు రోజుల నుంచి గుంటూరు కారం చిత్రం రద్దు అయింది అనేలా తెగ న్యూస్ వైరల్ అవుతుంది. మొదట సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ తొలగించారని వార్తలు వచ్చాయి. దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది. అయినా, థమన్ ఉన్నాడా లేడా అనేది చిన్న అనుమానం. ఈ సమయంలోనే పూజా హెగ్డే ను ఈ ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్టు మరో వార్త. దీనిపై చిత్ర యూనిట్ స్పందించకపోవడంతో, దాదాపు ఈ వార్త నిజమే అని అనుకుంటున్నారు.

అసలు గుంటూరు కారం విడుదలైవుతుందా లేదా అనే స్థాయికి చేరిపోయింది. కానీ, ప్రొడ్యూసర్ల సన్నిహితులు ఈ చిత్రం రిలీజ్ డేట్ గురించి, తర్వాత షెడ్యూల్ గురించి క్లారిటీ ఇవ్వడంతో గుంటూరు కారం కాస్ట్ అండ్ క్రూలో భారీగా మార్పులు జరిగిన, సినిమా కొనసాగుతుంది అనే క్లారిటీ వచ్చింది. అయితే గుంటూరు కారంలో పూజా హెగ్డే లేకపోవడం ఇటు త్రివిక్రమ్ కు గానీ, ఫ్యాన్స్ కు గానీ కొంత అసౌకర్యంగా ఉన్నా, ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న శ్రీలీలకు మాత్రం చాలా హ్యాపీగా ఉందని తెలుస్తుంది.

ఎందుకంటే, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు 50 నుంచి 60 శాతం పూర్తి అయింది. ఇందులో పూజా హేగ్డే పై ఎక్కువ పార్ట్ షూటింగ్ కాలేదని సమాచారం. షూట్ మొత్తం మహేష్ – శ్రీలీల పైనే చేశారట. ఇప్పుడు 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన సినిమాకి కొత్త హీరోయిన్ ను తీసుకోవడం కష్టమే. కాబట్టి.. గుంటూరు కారంలో మెయిన్ హీరోయిన్ గా శ్రీలీలనే కానుందని టాక్ వినిపిస్తుంది. ముందుగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ శ్రీలీల చేయడంపై అమె అభిమానులు చాలా హార్ట్ అయ్యారు..!!

rakul preet: They have already gotten me married twice

dasara villain joins jr ntr’s devara!