తన తరువాతి సినిమా గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు యంగ్ హీరో నాగ చైతన్య. కొన్నిరోజులుగా చైతన్య బాలీవుడ్ హిట్ మూవీ భూల్ భులయ్యా2 రీమేక్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని నాగ చైతన్య టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై ట్వీట్ చేసిన టీమ్.. ‘‘భూల్ భులయ్యా 2’ లో నాగ చైతన్య నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ రూమర్స్‌ను నమ్మొద్దు. ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మేము అధికారింగా ప్రకటిస్తాం’’ అని స్పష్టం చేసింది.
దీంతో చై తరువాతి సినిమాపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పడింది. ఇక బాలీవుడ్ లో గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది భూల్ భులయ్యా 2 మూవీ. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు కీ రోల్స్ పోషించిన ఈ సినిమా ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ ను ఒడ్డున పడేసింది. దీంతో ఈ సినిమా రీమేక్ పై అనేక కథనాలు వినిపించాయి. ఇక తాజాగా వచ్చిన క్లారిటీతో ఈ రూమర్స్ కు చెక్ పడింది..!!