in

global heroine priyanka chopra in ntr’s next?

RRR సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీర్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ రావడమే గాక..హాలీవుడ్​లోనూ గుర్తింపు వచ్చింది. ఇక ఆర్ఆర్ఆర్ గెలుపు జోష్​లో ఉన్న తారక్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్..టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. దీని తర్వాత ఆయన ‘కేజీయఫ్​’ ఫేమ్​ ప్రశాంత్​ నీల్​తో ఓ భారీ బడ్జెట్​ సినిమా చేస్తున్నారు.

ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్​ న్యూస్ వైరల్ అవుతోంది..ఈ సినిమాలో తారక్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు గానీ సోషల్​మీడియాలో మాత్రం ఈ పేరు చక్కర్లు కొడుతోంది. అంతకముందు దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు ప్రియాంక దాదాపుగా కన్ఫమ్​ అయినట్టు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మించనున్నాయి..!!

naga chaithanya denies the rumors of ‘Bhool Bhulaiyaa 2’ remake!

16 years for dubai seenu!