ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ ఇచ్చిన షాక్ నుంచి క్రమంగా బయటపడుతున్న నాగ చైతన్య నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇది గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రూపొందబోతున్న సంగతి తెలిసిందే. కథకు సంబంధించిన కీలకమైన పాయింట్ స్వయంగా నిర్మాత బన్నీ వాస్ నుంచే బయటికి వచ్చింది. ఇది గుజరాత్ లో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రాసుకున్నారు. ఇందులో చైతు బోటు డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. ప్రేమకథతో పాటు ఎమోషన్స్, యాక్షన్స్, ఎలివేషన్స్ అన్నీ ఓ రేంజ్ లో ఉంటాయట. ఉప్పెన తరహాలో సముద్రం బ్యాక్ డ్రాప్ అన్నమాట.
చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందబోయే ఈ హై వోల్టేజ్ డ్రామాకు సుమారు అరవై కోట్ల దాకా బడ్జెట్ కేటాయించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. అంటే చైతు కెరీర్ లో హయ్యెస్ట్ ఇదే అవుతుంది . సబ్జెక్టు అంత డిమాండ్ చేయడంతో ఆమేరకు అల్లు అరవింద్ ఎస్ చెప్పేశారట. బ్యాక్ డ్రాప్ ని బట్టి చూస్తే నాగ చైతన్య ఇందులో ఎక్కువ శాతం గళ్ళచొక్కా, చారల పంచతో కనిపించబోతున్నాడు. 2018 ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ వాస్ ఓపెన్ కావడంతో ఈ విషయం బయట పడింది. అక్కినేని ఫ్యాన్స్ ఇది చూసి హమ్మయ్య అనుకుంటున్నారు..!!