సెలబ్రెటీలకు సంబంధించిన ఏ వ్యక్తిగత విషయమైనా తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. ముఖ్యంగా వారి పెళ్లికి సంబంధించిన వార్తలపై మరింత ఇంట్రస్ట్ చూపించడం సాధారణమైన విషయమే. తాజాగా కీర్తి సురేష్ పెళ్లిపై కూడా పలు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలే. మే 18న కీర్తి సురేష్.. దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. అతనితో దిగిన కొన్ని ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే.. ఈ ఫొటోలపై కొన్ని వార్తలు ప్రచారం అయ్యాయి. ఆ ఫొటోల్లో ఉన్న వ్యక్తితో కీర్తి సురేష్ డేటింగ్ చేస్తోందని, త్వరలో వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ క్రియేట్ చేశారు.
ఇక కీర్తి సురేష్ షేర్ చేసిన ఫొటోలోని వ్యకి విషయానికొస్తే.. అతను దుబాయ్‌కి చెందిన రియల్టర్ ఫర్హాన్ బిన్ లియాఖత్ అని తెలుస్తోంది. అతని పేరును కూడా ఆమె ఇన్ స్టా స్టోరీలో రాసుకువచ్చింది. ఈ ఫొటోల్లో ఇద్దరూ పసుపు రంగు దుస్తులు ధరించి కెమెరా ట్విన్నింగ్ కోసం పోజులిచ్చారు. ఇదిలా ఉండగా ఫర్హాన్ తన అకౌంట్ లో చేసిన పోస్టులోనూ కీర్తితో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. ఆ చిత్రాన్ని కూడా కీర్తి సురేష్ మళ్లీ షేర్ చేసింది..కేరళకు చెందిన ఫర్హాన్ దుబాయ్‌లో ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. పలు నివేదికల ప్రకారం పర్హాన్, కీర్తితో కొంతకాలంగా స్నేహంగా ఉంటున్నాడు..!!