తాను సీనియర్ ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ అని.. కాబట్టి తాను తెలుగులోకి వెళ్తే బ్లాక్ బస్టర్తోనే వెళ్లానని నిశ్చయించుకున్నట్టు ఆమె తెలిపారు. అలా ఎదురుచూస్తుండగానే తనకు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ద్వారా మంచి అవకాశం వచ్చిందన్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో నటించానని, ఆ తర్వాత ‘కౌసల్య క్రిష్ణమూర్తి’ రిమేక్ ఇక్కడ చేశామని తెలిపారు. తెలుగులో నేరుగా ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ సినిమాల్లో నటించానని తెలిపారు. అయితే తమిళ సినిమాల్లో తాను దాదాపు సెంట్రిక్ ఫిమేల్ క్యారెక్టర్ లో చేశానని..దీనిపైనా తన తల్లి ప్రశ్నించేదని..
ఎందుకు తెలుగు సినిమాల్లో సెంట్రిక్ ఫిమేల్ క్యారెక్టర్స్ లో చేయవని అడిగినట్టు ఆమె గుర్తు చేసుకున్నారు. తాను అప్పుడు కూడా అదే సమాధానమిచ్చానని, తెలుగు సినిమాల్లో ఆ క్యారెక్టర్స్ లో చేయాలంటే స్టార్ పొజిషన్ ఉండాలని చెప్పినట్టు ఐశ్వర్య రాజేష్ అన్నారు. కానీ తెలుగు బిడ్డనైనా..తనకు పెద్ద క్యారెక్టర్స్, పెద్ద సినిమాల్లో అవకాశం చాలా తక్కువగానే వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ఎస్ఆర్ ప్రభు, ప్రకాష్ బాబు తన మీద నమ్మకంతో ‘ఫర్హానా’ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారని చెప్పారు.