in

pooja hegde gets another crazy offer in bollywood!

పూజా హెగ్డే మరో హిందీ ఆఫర్ పట్టేసింది. షాహిద్ కపూర్ హీరోగా రూపొందబోయే కోయి షక్ లో హీరోయిన్ గా ఎంపికయ్యిందని ముంబై అప్డేట్. దర్శకుడు రోషన్ ఆండ్రూస్. ఈయన మలయాళం డైరెక్టర్. దుల్కర్ సల్మాన్, మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ లాంటి స్టార్లతో బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. సుధీర్ బాబు రీమేక్ చేసుకున్న హంట్ ఒరిజినల్ వెర్షన్ ముంబై పోలీస్ ఈయనదే. మిస్టరీ థ్రిల్లర్స్ డీల్ చేయడంలో రోషన్ ది ప్రత్యేక శైలి. మొదటిసారి హిందీ డెబ్యూ చేయబోతున్నారు. టైటిల్ చూడగానే ఇది కూడా సస్పెన్స్ క్యాటగిరీని అర్థమైపోతోంది.

ఇక టాలీవుడ్ విషయానికి వస్తే పూజా హెగ్డే ఆశలన్నీ మహేష్ బాబు 28 మీదే ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ తన ఫ్లాపుల ప్రహసనానికి బ్రేక్ వేస్తుందని ఎదురు చూస్తోంది. గత ఏడాది రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య ఇచ్చిన షాకులు చిన్నవి కాదు. దీంతో మార్కెట్ డిమాండ్ మీద ప్రభావం పడింది. ఒకపక్క శ్రీలీల పదికి పైగా సినిమాలతో దూసుకుపోతూ టాప్ వన్ ర్యాంక్ మీద కన్నేసింది. ఇప్పుడు వెనుకబడకుండా ఉండాలంటే పూజాకు ఏ భాష అయినా సరే సాలిడ్ గా రెండు బ్లాక్ బస్టర్లు పడాల్సిందే..!!

rakul preet sensational comments on heroines remuneration!

Prabhas interesting comments on Chatrapathi remake!