ఎప్పుడూ ట్రోలింగ్ అవుతూ సోషల్ మీడియాలో హాట్‌గా ఉండే టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ మరోసారి చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను అశ్లీల లేదా అసహజ ప్రశ్నలతో వేధిస్తుంటారు. అయితే తన అభిప్రాయాల్ని వ్యక్తపర్చడంలో ఆమె ఎప్పుడూ వెనుకాడలేదు. అందుకే అనుసూయకు అభిమానుల్లో అంత క్రేజ్ అని చెప్పవచ్చు. తాజాగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చాట్ నిర్వహించింది. ఈ చాట్‌లో అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు షాక్ అయ్యింది కూడా.
ఈ ప్రశ్నలు ఆమెను బాధించి ఉండవచ్చు. కానీ చాలా స్పోర్టివ్‌గా సమాధానమిచ్చింది. మహిళలతో లైంగిక సంబంధాలున్నాయా అనేది ఆ ప్రశ్న. స్వలింగ సంపర్కుల్లో స్నేహితులు, బంధువులు ఉన్నారు కానీ నాకెప్పుడు ఎదురు కాలేదని బదులిచ్చింది. ఈ విధమైన జటిల ప్రశ్నల్ని సైతం ఆమె డీల్ చేసిన విధానం చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అభిమానులు అగ్రహించుకున్నప్పుడు కూడా అంతే చమత్కారంగా బదులిచ్చి చాట్ ముగించడం ఆమెకే చెల్లింది. యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందేనని చెప్పినప్పుడు కూడా లవ్ యూ బ్యాక్ అని ముగించేసింది..!!