in

prabhas down with fever, cancels films shoot?

బిజీగా ఉన్న ప్రభాస్‌కు తాజాగా ఆరోగ్యం బాగా లేదట. జ్వరంతో మన డార్లింగ్ బాధపడుతున్నాడట. అందుకే సినిమా షూటింగ్‌లను క్యాన్సిల్ చేశాడు. ఈ నెలలో పీపుల్ మీడియా వారి సినిమాను ప్రారంభించాల్సి ఉందని, కానీ ప్రభాస్ ఆ షూటింగ్‌ను క్యాన్సిల్ చేసినట్టు సమాచారాం. ప్రభాస్ ప్రస్తుతం మారుతి సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ప్రశాంత్ నీల్ సలార్ సినిమా దాదాపు షూటింగ్ అంతా పూర్తయింది. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ అలా సాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమాల మీద చర్చలు మొదలయ్యాయి.

ప్రభాస్ మైత్రి మూవీస్ సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో సినిమా కూడా ఫిక్స్ అయిపోయింది. దిల్ రాజుతో ప్రభాస్ సినిమా కూడా ఉండబోతోంది. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా కూడా ప్రభాస్ అనౌన్స్ చేశాడు. ఆదిపురుష్‌ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీం బిజీగా ఉంది. వీఎఫ్‌ఎక్స్, సీజీ పనులను మళ్లీ స్టార్ట్ చేశారు. అలా ప్రభాస్ సినిమాలన్నీ ఒక్కో దశలో ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో షూటింగ్‌లు క్యాన్సిల్ చేశాడని టాక్. అయితే అభిమానులు అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదని, ప్రభాస్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని అంటున్నారు..!!

Samantha shooting with 30 kg saree for shakunthalam?

Geetha Govindam combo joins hands with chaithu’s script?