in

bollywood not giving the required priority to Pooja Hegde?

త నెల విడుదలైన దృశ్యం 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేసిన బాలీవుడ్ ఇప్పుడు 23న రిలీజ్ కాబోతున్న సర్కస్ మీద గురి పెట్టింది. రణ్వీర్ సింగ్ హీరోగా డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకుడు. యాక్షన్ అయినా సింగం అయినా చెన్నై ఎక్స్ ప్రెస్ లాంటి కామెడీ డ్రామా అయినా తనదైన శైలిలో మాస్ టచ్ ఇస్తాడని గుర్తింపు ఉన్న ఇతని మీద పెద్ద అంచనాలే ఉన్నాయి. ప్రమోషన్లు బలంగా చేశారు. ట్రైలర్ లో ఎంటర్ టైన్మెంట్ కనిపించింది కానీ ఆ స్థాయిలో సినిమా మొత్తం ఉంటేనే హిట్టు కొడుతుంది లేదంటే రణ్వీర్ సింగ్ కు ఈ ఏడాది మరో షాక్ తప్పదు.

ఇందులో ఇద్దరు హీరోయిన్లు. దీపికా పదుకునే మాత్రమే హైలైట్ అవుతుండగా పూజా హెగ్డేని టీమ్ పెద్దగా ప్రమోట్ చేయడం లేదు. తను ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ షూటింగ్ తో పాటు మహేష్ బాబు 28తో బిజీగా ఉంది కానీ వీలు చూసుకుని రమ్మంటే కాదనలేదుగా. అయినా కూడా తన కన్నా ఎక్కువగా దీపికా పేరే వినిపిస్తోంది. ప్రాధాన్యత విషయంలో ముంబై మీడియా భార్యాభర్తల వైపే మొగ్గు చూపిస్తోంది. పైగా ఆ మధ్య వదిలిన వీడియో సాంగ్ లో రణ్వీర్ దీపికల జోడి, డాన్సు కనువిందుగా ఉండటంతో పూజా పాత్ర నామమాత్రమేనా అనే అనుమానం కలగడం సహజం. టాలీవుడ్ లో ఎంత దివ్యమైన కెరీర్ ఉన్నప్పటికీ బాలీవుడ్ లోనూ నెగ్గాలని పూజా హెగ్డే ఎప్పటి నుంచో ట్రై చేస్తోంది..!!

SHOBHAN BABU SALAHANU LIGHT GA TEESUKUNNA RANGANATH!

Sanjay Dutt to be part of Prabhas horror-comedy!