in

Sanjay Dutt to be part of Prabhas horror-comedy!

ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్ నటించబోతున్నాడా? ఒకరు హీరో, మరొకరు విలన్. ఈ కాంబినేషన్ అదిరిపోద్ది. ఆల్రెడీ కేజీఎఫ్-2లో సంజయ్ దత్ విలనిజం చూశాం. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఢీ కొడితే, సిల్వర్ స్క్రీన్ బద్దలైపోతుంది. ఆరోజు త్వరలోనే రాబోతోంది. ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్ నటించబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో చేస్తున్న మూవీలో విలన్ గా సంజయ్ ను తీసుకునే ప్లాన్స్ లో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ రాబోతోంది.

అయితే.. అంతా ఊహిస్తున్నట్టు ఇదేదో యాక్షన్ టైపులో ఉండదు. హర్రర్ ఎలిమెంట్స్ తో నిండి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సంజయ్ దత్ ఇందులో దెయ్యంగా కనిపించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు ప్రభాస్, సంజయ్ కలిసి హర్రర్ కామెడీ పండిస్తారట. ఇలా అంతా కొత్త సెటప్ తో, కొత్త కథతో వస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా చేరితే, ప్రాజెక్టు నెక్ట్స్ లెవెల్ కు చేరుకుంటుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. మెయిన్ హీరోయిన్ గా మాళవిక మోహనన్ ను తీసుకున్నారు..!!

bollywood not giving the required priority to Pooja Hegde?

HAPPY BIRTHDAY AADHI!