in

Samantha To Take A Break From Acting?

స్ట్ మూవీనే హిట్ అవడంతో పన్నెండేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్‌‌ బిజీగా ఉంది సమంత. ఇప్పుడు కూడా తన చేతిలో వరుస సినిమాలున్నాయి. కానీ ఆరోగ్య సమస్యలతో కొన్ని నెలలుగా షూటింగ్స్‌‌కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం ‘మయోసైటిస్‌‌’కు ట్రీట్మెంట్‌‌ తీసుకుంటోంది. అయితే హిందీలో ఓ సినిమాతో పాటు ‘సిటాడెల్‌‌’ అనే వెబ్‌‌ సిరీస్‌‌లో  నటించాల్సి ఉంది.  రుస్సో బ్రదర్స్‌‌ నిర్మిస్తుండగా.. రాజ్‌‌, డీకే  డైరెక్ట్ చేయనున్నారు. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.

మంగళవారం ఈ వెబ్‌‌ సిరీస్‌‌ గురించి ఓ అఫీషియల్‌‌ అప్‌‌డేట్ ఇచ్చారు మేకర్స్. వచ్చే ఏడాది జనవరి నుండి వరుణ్‌‌ ధావన్ షూటింగ్‌‌లో పాల్గొంటాడని చెప్పారు. మొదటి నుండి ఈ వెబ్‌‌ సిరీస్‌‌లో సమంత నటిస్తోందని చెప్పిన టీమ్,  ఈ అనౌన్స్‌‌మెంట్‌‌లో మాత్రం ఎక్కడా ఆమె పేరును ప్రస్తావించలేదు. దీంతో ‘సిటాడెల్‌‌’లో సమంత నటించడం లేదేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. తన హెల్త్ కండిషన్‌‌ కారణంగా షూటింగ్స్ ఆలస్యమై నిర్మాతలకు నష్టం రాకూడదని ఈ వెబ్ సిరీస్ నుండి ఆమె తప్పుకుందని బాలీవుడ్ టాక్..!!

CHINNA TANAM LO INTI NUNCHI PAARIPOYINA GHANTASALA!

SHOBHAN BABU SALAHANU LIGHT GA TEESUKUNNA RANGANATH!