in

charming beauty Samantha undergone plastic surgery?

మంత మీద నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. సమంత ఎంత సైలెంట్‌గా ఉంటున్నా కూడా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. సమంత గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. తన పని తాను అన్నట్టుగా సైలెంట్‌గా చేసుకుంటూ ఉంటోంది. ట్రోలర్లకు కౌంటర్లు లేవు.. రూమర్ల మీద ఖండనలు లేవు. అయితే గత నెలలో సమంతకు చర్మ వ్యాధి సోకిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై సమంత మేనేజర్ నుంచి ఖండన ప్రకటన వచ్చింది. మామూలుగా అయితే సమంతే అలాంటి రూమర్లను చీల్చి చెండాడుతుంది. సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తుంది.కానీ సమంత ఎందుకో మొత్తానికే సైలెంట్ అయింది.

సమంత ఇంతలా సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణం ఏంటో తెలియడం లేదు. అయితే సమంతకు గతంలోనే చర్మానికి సంబంధించిన వ్యాధి ఉందని, ఇప్పుడు మళ్లీ అది ఎక్కువైందని, అందుకే షూటింగ్‌లకు దూరంగా ఉంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా సమంత మొహానికి సర్జరీ జరిగిందనే రూమర్లు బయటకు వచ్చాయి. ఆమె తాజాగా చేసిన యాడ్, అందులోని ఫోటోలను గమనిస్తే సమంత మొహంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా మొత్తం కూడా సమంత సర్జరీ గురించి మాట్లాడుకుంటోంది. అయితే ఇందులో నిజమెంత ఉందనేది సమంతకు మాత్రమే తెలియాలి..!!

VANISRI LAW!

happy birthday mano!