in

Dulquer Salmaan’s first Remuneration!

లయాళ సూపర్ స్టార్ మమూట్టి కుమారుడు అయిన దుల్కర్ సల్మాన్ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు,” మహానటి “,” సీతారామం” వంటి డైరెక్ట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు, తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన పలు ఇంటర్వ్యూలలో తన మనసులో మాటలు పంచుకోవటం జరిగింది. ఎవరికయినా తన మొదటి సంపాదన ఎంతో మధురమయిన అనుభూతిని ఇస్తుంది, అలాగే దుల్కర్ కూడా తన మొదటి సంపాదన ఎంతో ఒక ఇంటర్వ్యూ లో చెప్పటం జరిగింది. తనకు పదేళ్ల వయసు ఉన్నపుడు, రాజీవ్ మీనన్ కు చెందిన యాడ్ ఏజెన్సీ వాళ్ళు తాను చదువుకుంటున్న స్కూల్ కి వచ్చి కొంత మంది పిల్లలను ఒక యాడ్ కోసం ఎంపిక చేసారని, అందులో దుల్కర్ కూడా ఒకరని తెలియ చేసాడు..

ఆ యాడ్ లో నటించినందుకు, దుల్కర్ కి 2000 రూపాయలు రెమ్యూనరేషన్ గ ఇచ్చారట. ఆ వయసు లో అంత మొత్తం అంటే కోటి రూపాయలతో సమానంగా ఫీల్ అయిన దుల్కర్, ఆ డబ్బులో 500 వందలు తన అమ్మమ్మ, తాతయ్యలకు ఇచ్చి, మిగతా డబ్బులు, తన తల్లికి ఇచ్చాడట. ఇక చూడండి ఎక్కడికి అయిన బయటకు వెళ్ళినప్పుడల్లా, ఆ డబ్బులో తనకు ఏదయినా కొనిపెట్టమని పేచీ పెట్టేవాడట, వాళ్ళ అమ్మగారేమో సరదాగా నీ డబ్బులు ఎప్పోడో ఖర్చు అయిపోయాయి అని అట పట్టించే వారట. ఈ విధంగా తన చిన్న నాటి మధురానుభూతులను పంచుకున్నాడు దుల్కర్ సల్మాన్, మరి ఇప్పుడెంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో మాత్రం చెప్పలేదు. ఆడ పిల్ల వయసు, మగవాడి సంపాదన అడగ కూడదు అంటారు కదండీ..!!!

struggling hero Allu Sirish gives a spicy feast for youth!

‘Vakeel Saab’ Ananya Nagalla trashes wedding rumors!