హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఛార్మి ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతుంది. పూరి జగన్నాధ్ తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తుంది. అయితే చాలా కాలంగా పూరి-ఛార్మిల మధ్య ఎఫైర్ నడుస్తుందనే ప్రచారం జరుగుతుంది. పూరితో రిలేషన్ కారణంగానే ఛార్మి ఇంకా పెళ్లి చేసుకోలేదనే వార్తలొస్తున్నాయి. తాజాగా ఛార్మితో తనకున్న రిలేషన్ గురించి మాట్లాడారు పూరి..ఛార్మి 13 ఏళ్ల వయసప్పటి నుంచి తనకు తెలుసని..దశాబ్దాలుగా ఆమెతో కలిసి పని చేస్తున్నానని తెలిపారు.
ఛార్మితో తనకు ఎఫైర్ ఉందని ఏదేదో మాట్లాడుకుంటారని.. ఆమె యంగ్ గా ఉండడం వలనే *ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని అన్నారు. అదే ఛార్మికి యాభై ఏళ్లు ఉంటే ఇలా ఎవరూ మాట్లాడేవారు కాదని..ఆమెకి వేరేవాళ్లతో పెళ్లి జరిగినా పట్టించుకునేవారు కాదని చెప్పారు. ఒకే ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ట్రావెల్ చేస్తుండడంతో ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒకవేళ ఎఫైర్ ఉన్నా.. ఎక్కువ రోజులు నిలబడదని.. ఆకర్షణ కొన్ని రోజుల్లోనే చచ్చిపోతుందని.. స్నేహమే శాశ్వతమని క్లారిటీ ఇచ్చారు పూరి..!!