in

Angry Nayanthara Fans Slams Karan Johar after ‘Disrespecting’ Her!

ప్రస్తుతానికి కాఫీ విత్ కరణ్  ఏడవ సీజన్ జరుగుతుండగా అందులో మూడవ ఎపిసోడ్ లోనే సమంత -అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంతను సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అని కరణ్ జోహార్ ప్రశ్నించారు. దానికి సమంత ఆసక్తికరంగా స్పందిస్తూ నేను ఇటీవల నయనతారతో కలిసి ఒక ప్రాజెక్టు చేశాను ఆ ప్రాజెక్ట్ చివరి రోజు ఆమె ఎమోషనల్ అయ్యారు అంటూ చెప్పుకొచ్చింది. దానికి కరణ్ జోహార్ స్పందిస్తూ ఓకే అవునా నాట్ ఇన్ మై లిస్ట్ అంటే నా లిస్టులో ఆమె లేదు అంటూ కామెంట్ చేశాడు.

అయితే ఆయన ఎందుకలా కామెంట్ చేశాడో తెలియదు కానీ సౌత్ లో ఒక స్టార్ హీరోయిన్ అయిన నయనతారను పట్టుకుని అలా మాట్లాడడం ఏమిటి అంటూ ఇప్పుడు నయనతార అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అలా పక్షపాతం చూపిస్తున్నారు? నయనతార స్టార్ హీరోయిన్ అని ఒప్పుకోవడానికి మీకేంటి ఇబ్బంది? అంటూ ఆమె అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనికి కరణ్ జోహార్ స్పందిస్తారేమో చూడాలి మరి..

Disha Patani requested Director For icon star’s Scene!

Mahesh Babu to play a dual role in SSMB28?