in

Pawan Kalyan, Renu Desai attends son Akira’s high school event!

వన్ కల్యాణ్, రేణు దేశాయ్ విడిపోయిన సంగతి తెలిసిందే. రేణు దేశాయ్ తో విడిపోయిన తర్వాత పవన్ మరో పెళ్లి చేసుకున్నారు. ఆవిడతో పవన్ కు పిల్లలు కూడా ఉన్నారు. మరోవైపు రేణుదేశాయ్ మాత్రం సింగిల్ గానే ఉంటోంది. పవన్-రేణుదేశాయ్ పిల్లలే అకిరా, ఆద్య. వీళ్ల కోసం పవన్-రేణు అప్పుడప్పుడు కలుస్తుంటారు. తాజాగా మరోసారి కలిశారు. ఈసారి మాత్రం ఆ పిక్ వైరల్ అయింది. అకిరా స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే జరిగింది. దీనికి పవన్-రేణు హాజరయ్యారు. ఇండస్ స్కూల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పవన్, రేణు, అకిరా, ఆద్య కలిసి ఫొటో దిగారు. ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇదే గ్రాడ్యుయేషన్ డే లో అకిరా అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు. తన కీబోర్డ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఆర్ఆర్ఆర్ లోని దోస్తీ పాటను కీబోర్డ్ పై వాయించి అలరించాడు అకిరా. మొత్తమ్మీద పవన్-రేణు మరోసారి కలవడం అతడి ఫ్యాన్స్ కు ఆనందంగా అనిపించింది. పైగా అందులో అకిరా ఉండడం వాళ్ల ఆనందం రెట్టింపైంది. అకిరాకు ప్రస్తుతం 17 ఏళ్లు. మరోవైపు అకిరా తల్లి రేణుదేశాయ్ మాత్రం సింగిల్ గానే ఉన్నారు. గతంలో పెళ్లి చేసుకుంటానంటూ, ఆమె ఎంగేజ్ మెంట్ రింగ్ ను చూపించినప్పటికీ, ఆ తర్వాత తన పెళ్లి గురించి రేణు ఎలాంటి ప్రకటన చేయలేదు…

Kangana Ranaut Hot Blenders pride Fashion Tour!

Pooja Hegde reveals lost all her luggage before red carpet debut!