in

not dimple hayathi, its Chandrika Ravi to do special song for balayya!

ట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇందులో శ్రుతీ హాసన్ కథానాయిక. రెండో కథానాయికగా హానీ రోజ్ ఎంపిక అయ్యారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలకు తోడు మరో కథానాయిక కూడా సినిమాలో సందడి చేయనున్నారు. అయితే, ఒక్క పాటలో మాత్రమే. బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంది. అందులో ‘ఖిలాడి’ బ్యూటీ డింపుల్ హయతి స్టెప్పులు వేయనున్నారని ప్రచారం జరిగింది. అయితే, అందులో నిజం లేదు.

బాలకృష్ణ సినిమాలో డింపుల్ సాంగ్ చేయడం లేదు. ఆ అవకాశం ఆమెకు రాలేదు. మరి ఎవరు చేస్తున్నారు? అంటే… చంద్రికా  రవి. భారతీయ మూలాలు ఉన్న ఆస్ట్రేలియా అమ్మాయి చంద్రికా రవి. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు. మోడలింగ్ చేస్తూ… సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. తెలుగులో ‘చీకటి గదిలో చితకొట్టుడు’ సినిమా చేశారు. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సాంగ్ షూటింగ్ చేస్తున్నారని సమాచారం.

shekar!

honour to be a part of Major, says Sobhita Dhulipala!