అషూ రెడ్డి టాప్ – 5 లో ఉంటుందని అంచనా వేసుకుంది. ఇది మా అమ్మ కల అంటూ హౌస్ లో మాట్లాడింది కూడా. కానీ, ఇప్పుుడు టాప్ 5లో లేకుండానే వెళ్లిపోయింది. అరియనాని ఫస్ట్ టైమ్ నామినేట్ చేసిన అషూ లాజిక్ లేని పాయింట్స్ మాట్లాడింది. పీచ్ రూమ్ లో అఖిల్ కి దూరంగా ఉంటున్నావని ఎందుకు అన్నావ్ ? మా అమ్మ వచ్చినప్పటి నుంచీ అలా ఉన్నవని నువ్వు ఎందుకు అన్నావ్ అంటూ నిలదీసింది. నామినేట్ చేసింది. దీనికి అరియానా క్లారిటీ ఇచ్చినా కూడా ఇధ్దరికీ చాలారోజులు పడలేదు..
అంతేకాదు, ఒకరిపై ఒకరు సెటైర్స్ కూడా వేసుకున్నారు. దీంతో అరియానా ఫ్యాన్స్ కి యాంటీ అయిపోయింది అషూ. అంతేకాదు, సోషల్ మీడియాలో అన్ అఫీషియల్ పోలింగ్స్ లో కూడా అషూ లీస్ట్ లోనే ఉంది. ఈవారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ అఖిల్ సంపాదించి ఉంటే బహుశా అషూని సేఫ్ చేసి ఉండేవాడు ఏమో. కానీ, చేయలేదు. అలాగే, టాస్క్ విషయంలో కూడా అషూకి హెల్ప్ చేయలేదు అఖిల్. అరియానాకి పాస్ కోసం పోటీపడే అర్హతని ఇచ్చాడు.
దీంతో అషూ బాగా ఫీల్ అయ్యింది. ఇప్పుడు అదే ఫీలింగ్ తో హౌస్ నుంచీ ఎలిమినేట్ అయ్యింది..అషూరెడ్డి లాస్ట్ టైమ్ సీజన్ లో పెద్దగా గేమ్ ఆడింది లేదు. ఆ అవకాశం కూడా తనకి రాలేదు. త్వరగానే ఎలిమినేట్ అయ్యింది. కానీ, ఇప్పుడు ఆల్ మోస్ట్ టాప్ 5 వరకూ వచ్చింది. గేమ్ పరంగా కూడా పెద్దగా పెర్ఫామన్స్ ఇచ్చి, ఛాలెంజస్ గెలిచింది కూడా లేదు. అలాగే, సంచాలక్ గా కూడా విఫలం అయ్యింది అషూ