in

Manjima Mohan been subjected to body shaming!

హీరోయిన్లు బాడీ షేమింగ్ కు గురవడంతో ఈమధ్య కామన్ అయిపోయింది. కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఆయా హీరోయిన్లలో కొందరు ఘాటుగా స్పందిస్తుంటే.. మరికొందరు వెరైటీగా స్పందిస్తూ ట్రోలర్స్ నోటికి తాళం వేస్తున్నారు. తాజాగా మలయాళ బ్యూటీ మంజిమా మోహన్ బాడీ షేమింగ్ బారినపడింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంజిమ.. తాజాగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో చాలా లావుగా కనిపించింది.

మరీ బొద్దుగా అనిపించడంతో నెటిజన్లు బాడీ షేమింగ్ కి దిగారు. కొందరైతే అసభ్యంగా కామెంట్స్ చేశారు. వాటిపై స్పందించిన మంజిమ.. కొందరు సహజంగానే లావుగా ఉంటారు. మీరు కామెంట్స్ చేసినంత మాత్రాన ఎవరూ సన్నగా నాజూగ్గా మారిపోరు అంటూ కౌంటర్ ఇచ్చింది. బాడీ షేమింగ్ చేయడం వల్ల ఆత్మ విశ్వాసం దెబ్బ తింటుందన్న ఆమె.. శరీర లక్షణాలని బట్టి లావు, సన్నం అనేది ఉంటుందని స్పష్టం చేసింది. కొందరు నెటిజన్లు మంజిమకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. పనిగట్టుకుని విమర్శించేవాళ్లకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారని అంటున్నారు.

Andrea agrees to go nude for Mysskin’s horror-thriller!

rgv gets kissed by his ‘dangerous’ heroines!