in

Shivani Rajasekhar to participate in Miss India audition!

జీవిత రాజశేఖర్ ల పెద్ద కూతురు శివాని రాజశేఖర్‌ అందరికీ సుపరిచితమే. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆల్రెడీ ‘అద్భుతం’ ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ వంటి రెండు సినిమాలు చేసింది. గతంలో ఈమె పేరు పై ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే మరియు కల్కి వంటి సినిమాలు కూడా నిర్మితమయ్యాయి.ఈమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది కూడా. ఇక శివానీ నటించిన రెండు కూడా ఓటిటిలోనే రిలీజ్ అయ్యాయి. రెండిటికి ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభించింది.

నిజానికి ఈ 2018లోనే ‘2 స్టేట్స్‌’ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వాలి. అడివి శేష్ ఆ చిత్రంలో హీరో..! కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ ఆగిపోయింది. దీంతో ఆమె ఎంట్రీ లేట్ అయ్యింది. అయితే ఈమె ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తుంది. అన్బరివు,‘ఆర్టికల్‌ 15’ రీమేక్‌ వంటి తమిళ చిత్రాలతో పాటు ఆమె తండ్రి రాజశేఖర్ నటిస్తున్న ‘శేఖర్’ మూవీలో కూడా ఈమె నటిస్తుండడం విశేషం. ఇదిలా ఉండగా.. శివానీ రాజశేఖర్ త్వరలో ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీల్లో పాల్గొనబోతుండడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

ఈ విషయాన్ని స్వయంగా శివానీ రాజశేఖర్ చెప్పుకొచ్చింది. ‘కిరీటం కోసం నా కొత్త ప్రయాణం మొదలైంది.ఈరోజే ఫెమినా మిస్ ఇండియా ఆడిషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ, తమిళ్ నాడు ని రిప్రెజెంట్ చేస్తూ… మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి, అదృష్టం కూడా తోడవ్వాలని కోరుకుంటున్నాను. ‘@missindiaorg’ వారు నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు గాను నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను!’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.

No honeymoon for Ranbir – Alia Bhatt now, Here’s why!

producer worry with hot anchor anasuya’s negligence!