జైభీమ్..ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా థీమ్‌కు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. సూర్య ఎప్పట్లానే తన పాత్రకు ప్రాణం పోశాడు. అయితే ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో పాత్ర సినతల్లి. భర్తను కాపాడడం కోసం ఎన్నో కష్టాలు పడుతూ.. న్యాయం కోసం లాయర్ గా నటిస్తున్న సూర్య దగ్గరకు వెళ్లి..తన సహాయంతో ఈ కేసును కోర్టు వరకు తీసుకెళ్లి..లాస్ట్ కి సూర్య ఈ కేసును చేధిస్తాడు. ఇక లాయర్ పాత్రలో సూర్య నటనకు ప్రేక్షకలోకం నీరాజనం పలికారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ సినిమాలో సినతల్లి పాత్రలో లిజొమోల్ జోస్ జీవించేసిందనే చెప్పాలి..
అద్భుమైన నటనతో ఒక్కసారిగా ప్రేక్షక లోకాన్ని ఆశ్చర్యపరిచింది ఈ మలయాళీ పిల్ల. సినిమా చూసినవారు ఈమె నటనను పొగడాల్సిందే. అంతగా పాత్రలో లీనమైంది. సూర్య లాంటి స్టార్ హీరో పక్కన ఉన్నప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా సినతల్లిగా ఆమె నటించిన తీరు అద్భుతం. ఇక రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘జై భీమ్’ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. న్యాయం కోసం పోరాడే ట్రైబల్ అమ్మాయిగా లిజోమోల్ జోస్ ఈ పాత్ర కోసమే పుట్టిందా అన్నట్లు నటించిన ఈమె ఈ సినిమాలో యాక్టింగ్ నాటురల్ గా ఉండడం కోసం గిరిజనులు చేసే పనులను దగ్గరుండి గమనించిందట.
ఇక ఈ సినిమాలో ఆమె పాము కాటుకు మందులు ఇస్తుంటారు కదా..ఆ పనులను నిజంగానే ఈ సినిమా కోసం నేర్చుకున్నిందట. అంతేకాదు ఈ సినిమా కోసం ఎలుకని కూడా తిన్నాను అని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది లిజొమోల్ జోస్. ‘గిరిజనులు పొలాల్లో దొరికే ఎలుకలను వేటాడి వండుకుని తింటారు. ఇక ఈ సినిమా కోసం నేను వాళ్లలా ఎలుక కూర తిన్నాను. వాళ్లు ఏం చేస్తారో నేను అదే చేయాలి అనుకున్నా. అందుకే తిన్నాను. నాకైతే అది అచ్చంగా చికెన్ కూరలానే అనిపించింది. అంటూ చెప్పుకొచ్చింది లిజోమోల్.