తాజాగా ‘గంగూబాయ్ కతియావాడి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆలియా భట్ తొలిసారిగా తన పెళ్లి విషయంపై స్పందించారు. లాక్‌డౌన్ లేకపోతే ఈపాటికి పెళ్లి అయిపోయి ఉండేదని రణ్‌బీర్ కపూర్ గతంలో అన్నారు కదా నిజమేనా? అని ఓ రిపోర్టర్ ఆలియాను ప్రశ్నించగా.. ‘నా దృష్టిలో మా పెళ్లి ఎప్పుడో అయిపోయింది. చాలా కాలం క్రితమే నా మైండ్‌లో అతన్ని పెళ్లి చేసేసుకున్నాను (నవ్వుతూ). రణ్‌బీర్ చెప్పింది నిజమే. లాక్‌డౌన్ కారణంగా అప్పుడు పెళ్లి వాయిదా పడింది.
మంచి సమయం వచ్చినప్పుడు తప్పకుండా మా పెళ్లి జరుగుతుంది’ అని పేర్కొన్నారు. అనంతరం తన ఇష్టాయిష్టాలపై స్పందించిన గంగూబాయ్.. ‘షూటింగ్ నుంచి ఏ మాత్రం ఖాళీ దొరికినా.. ఏదో ఒక కొత్త పని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా. సమయాన్ని అసలు వృథా చేయను. అది నాకు నచ్చదు. కరోనా కారణంగా షూటింగ్స్ వాయిదా పడిన సమయంలో మ్యూజిక్‌పై దృష్టిపెట్టాలనుకున్నా. ఆ సమయంలో గిటార్ నేర్చుకున్నా.
స్క్రీన్ రైటింగ్‌లో శిక్షణ తీసుకున్నా. చాలానే చేశా’ అని చెప్పారు. చిన్ననాటి నుంచి స్నేహితులైన రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్.. ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తమ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఖాళీ దొరికితే పబ్, పార్టీ, పెళ్లిళ్లకు జంటగా హాజరవుతున్నారు. ఇక ప్రస్తుతం ఆలియా గంగూబాయ్ కతియావాడి సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో ఆలియా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌తో ఆలియా మరో సినిమా కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.